NTV Telugu Site icon

KTR: అక్కచెల్లమ్మలపై ఆ ఉద్దేశం లేదు.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..

Ktr

Ktr

KTR: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించండి అన్నారు. పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదని కేటీఆర్ అన్నారు. బస్సుల్లో సీట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఇంకా బస్సులను పెంచాలనే ఉద్దేశంతో అన్నానని తెలిపారు. బస్సుల్లో అల్లం, బెల్లం తింటే తప్పేంటని మంత్రి సీతక్క అన్న మాటలకు కేటీఆర్ రిప్లై ఇచ్చానని తెలిపారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటుంటే సీతక్కకు కనపడలేదా? అని ప్రశ్నించానని అన్నారు. మరిన్ని బస్సులు పెంచాలని డిమాండ్ చేశామని తెలిపారు. బస్సుల సంఖ్య పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డ్యాన్స్, రికార్డ్ డ్యాన్స్ చేద్దాం.. మాకేంటి అంటూ కేటీఆర్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకులేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా క్షమాపనలు కోరారు.

Read also: Ascaris Lumbricoides: నులి పురుగులతో ఇబ్బందులా..? ఇలా చేయండి విముక్తి పొందండి..

సీతక్క ఫైర్..

తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదని, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు మంత్రి సీతక్క. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల అని ఆమె డిమాండ్‌ చేశారు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనమని, గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు.
Nagarjuna Sagar: సాగర్‌ కు కొనసాగుతున్న వరద.. 4 గేట్లు తెరచి నీటి విడుదల