NTV Telugu Site icon

MLC Kavitha: తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం.. కేసీఆర్ను కలిసిన కవిత..

Kavitha Kcr

Kavitha Kcr

MLC Kavitha: ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. కవిత తన భర్త, కుమారుడితో కలిసి ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఐదున్నర నెలల తర్వాత, ఆమె తన తండ్రిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ చేతికి కవిత ముద్దు పెట్టారు. కన్న కూతురిని చూసిన కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్న బిడ్డను ప్రేమగా గుండెకు హత్తుకుని ఆశీర్వదించారు. కవితను చూసి కేసీఆర్ మొహంలో ఆనందం వెల్లివిరిసింది. చాలా కాలం తర్వాత అధినేత కేసీఆర్ ఉత్సాహంగా కనిపించారు. పార్టీ నాయకులు, సిబ్బంది తమ అధినేత సంతోషంలో పాలుపంచుకున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా.. కవిత ఎర్రవల్లి ఫాంహౌస్‌లో 10 రోజుల పాటు ఉండనున్నారు. తనను కలవడానికి ఎవరూ రావద్దని కవిత కోరారు.

Read also: Mallu Bhatti Vikramarka: మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు ఆగస్టు 27న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 28న ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తల్లి శోభమ్మను కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో కవిత తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. రానున్న 15 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమయం కేటాయిస్తానని చెప్పారు. న్యాయం గెలిచిందని, తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని తెలిపారు.
CM Revanth Reddy: హైడ్రా పేరుతో బెదిరిస్తున్నారు.. ఫిర్యాదులపై స్పందించిన సీఎం