Site icon NTV Telugu

Kaushik Reddy: రేపు మేము అధికారంలోకి వచ్చాక చూపిస్తాం..

Koushik Reddy

Koushik Reddy

Kaushik Reddy: పార్టీ మారిన వాళ్ళకి సిగ్గు శరం లజ్జ లేదు అని హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు అని విమర్శలు గుప్పించారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేసాను.. కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.. స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చింది.. జీవోను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పింది అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి సోదరుడు ఏ హోదాలో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఏ హోదాలో ఆయన పంచుతున్నారు.. సిగ్గుందా మీకు? అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

Read Also: Flipkart UPI: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త యాప్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్

ఇక, మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమే అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారు.. రేపు మేము అధికారంలోకి వచ్చాక చూపిస్తాం.. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు అని తెలిపారు. అలాగే, బుధవారం కూడా కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. కుంభకోణం చేయలేదని, తడిబట్టలతో వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేదమ్ముందా అంటూ సవాల్ చేశారు. ఇప్పటికే తాను ఎలాంటి మోసాలకు, అవినీతికి పాల్పడలేదని తడిబట్టలతో కౌశిక్ రెడ్డి హనుమంతుడి విగ్రహంపై ఒట్టు వేశారు.

Exit mobile version