NTV Telugu Site icon

Kaushik Reddy: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్చల్..

Koushik Reddy

Koushik Reddy

Kaushik Reddy: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించాలంటూ ఒత్తిడి చేశారు. అర్జెంట్ పని ఉండడంతో తిరిగి వచ్చి తీసుకుంటానని బయటకు వెళ్లేందుకు సీఐ యత్నించడంతో ఆయన కారును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెనక్కి వచ్చి ఫిర్యాదు తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కండువా కప్పుకుని డ్యూటీ చేయ్యండంటూ సీఐని కౌశిక్ రెడ్డి బెదిరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నీ సంగతి చెబుతామంటూ సీఐపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు సెల్యూట్ నువ్వే కొడుతావు.. మమ్మల్ని చూసి కూడా కంప్లైంట్ తీసుకోకుండా పారిపోతున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Wazedu SI Suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్..

కాగా, వార్డు మెంబర్ గా కూడా గెలవని సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లకు సెల్యూట్ కొడుతారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలో మీకు తెలియాలి.. తెలియకపోతే అసెంబ్లీ రూల్ బుక్ చదువుకో.. తనకి సీఎం బందోబస్తు ఉందంటున్నా వినకుండా సీఐపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డారు. 10 ఏళ్లు మా కింద పని చేశారు.. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సంగతి చెబుతామని పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు దమ్ముంటే కాంగ్రెస్ కండువా కప్పుకో.. నాతో పాటు పోటీ చెయ్యూ అంటూ సీఐపై విరుచుకుపడ్డారు. ఓ ఎస్ఐకి కంప్లైంట్ ఇవ్వమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను సీఐ రిసివ్ చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేల పట్ల ఎలా వ్యవహరించాలో సీఐకి నేర్పించి వెళ్తామన్నారు. 4 ఏళ్ల తరువాత మీ సంగతి చెబుతామంటూ సీఐతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.

Show comments