Site icon NTV Telugu

KTR Tweet: 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న.. కేటీఆర్‌ కీలక ప్రకటన..

Ktr

Ktr

KTR Tweet: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాధితుల పక్షాన పోరాడతామని చెప్పారు. దీంతో ఈరోజు బాధితులంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్ తో తమ గోడు వెళ్లబోసుకుందామని భావించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బీఆర్‌ఎస్‌ నేతలకు వివరించేందుకు వచ్చారు. కానీ తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రామా బాధితుల వద్దకు కేటీఆర్ రాలేకపోయారు. దీంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా తాను అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను కేటీఆర్ వివరించారు. 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు ట్వీట్ లో వెల్లడించారు.

Read also: Fire Accident: మేడ్చల్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..

ఆయన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్ మందులు వాడుతున్నట్లు తెలిపారు. త్వరలో కోలుకుంటానని, తప్పకుండా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తానని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివస్తున్న హైడ్రా బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపిన కేటీఆర్. తెలంగాణ భవన్ కి వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలబడాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.

Exit mobile version