Site icon NTV Telugu

Harish Rao: ప్రజా పాలన, ప్రజా దర్బార్ అంటివి.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..?

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అని ఎద్దేవా చేశారు. ఇక, పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటరులో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజా పాలన అంటివి, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతి రోజూ ప్రజలను కలుస్త అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి అని సెటైర్లు వేశారు హరీశ్ రావు.

Read Also: Gummanur Jayaram: గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు.. రైలు పట్టాలపై పడుకోబెడతా..!

ఇక, ముఖ్యమంత్రి, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు అని విమర్శలు గుప్పించారు. ఇక, ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నావు.. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నావు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని హరీశ్ రావు మండిపడ్డారు.

Exit mobile version