NTV Telugu Site icon

Hyderabad: పెళ్లైన 8 రోజులకే ప్రియుడితో లేచిపోయిన నవ వధువు..

Hyd

Hyd

Hyderabad: హైదరాబాద్ నగర పరిధిలోని కాళీ మందిర్ సమీపంలో పెళ్లైన 8 రోజులకే ప్రియుడితో నవ వధువు లేచిపోయింది. గురజాల అరవింద్ మౌనికను లేపుకెళ్లాడు. అయితే, మౌనిక, అరవింద్ లకు మధ్య గత కొంత కాలంగా ప్రేమాయణం కొనసాగింది. ఇక, గత ఎనిమిది రోజు క్రితం అత్తాపూర్ కు చెందిన శివరామకృష్ణతో జ్యోతి వివాహం అయింది. వరుడితో పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతంతో తల వంచి‌ తాళి కట్టించుకున్న నవ వధువు.. ప్రేమించిన ప్రియుడిని వదిలేసి ఉండలేకపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ ప్రియుడు అరవింద్ తో కలిసి లేచిపోయింది. ప్రియుడు అరవింద్ కు ఇది వరకే వేరే అమ్మాయితో పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Read Also: Samantha: సైలెంట్ గా స్టార్ డైరెక్టర్ తో మూవీ చేస్తున్న సమంత..

కాగా, అరవింద్ చేసిన నిర్వాకంపై కాలనీ వాసులు మండి పడుతున్నారు. అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. వివాహం అయిన అమ్మాయికి మాయ మాటలు చెప్పి.. తీసుకొని వెళ్ళాడని ఆరోపిస్తున్నారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసాడంటూ మండి పడుతున్నారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో గత మూడు రోజుల‌ క్రితం మౌనిక కనిపించడం లేదంటూ ఆమె భర్త సైతం కంప్లైంట్ ఇచ్చాడు. ఇక, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.