NTV Telugu Site icon

Shamshabad: మూడు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్..

Shanshabad Airport

Shanshabad Airport

Shamshabad: కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపుకాల్‌ రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. గోవా నుండి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో.. అలర్ట్‌ అయిన పైలెట్‌ వెంటనే శంషాబాద్‌ అధికారులకు ఎమర్జెన్స్‌ ల్యాండింగ్‌ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కు పర్మిషన్‌ ఇచ్చారు. దీంతో గోవా నుండి కలకత్తా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇండిగో విమానానికి, హైదరాబాద్ టు పూనా ఇండిగో విమానానికి, మొత్తం మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాలను ఐసోలేషన్ తరలించి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?