Hyderabad Hydra: MCOR ప్రాజెక్ట్స్ LLP ను నిర్మిస్తున్న బిల్డర్ కు ఓ వ్యక్తి హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడిన ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొందరు బిల్డర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సోషల్ యాక్టివిస్ట్ , సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం నిర్వహించాడు.
Read also: Top Headlines @9AM : టాప్ న్యూస్
అంతటితో ఆగలేదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో తనకు దగ్గరి పరిచయం అని చెప్పి, కమిషనర్ రంగనాథ్ తో కలిసి దిగిన ఫోటోలు చూపి బెదిరింపులకు పాల్పడ్డాడు. పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి హైడ్రా రంగనాథ్ తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ, బెదిరించాడు. రంగనాథ్ తనకు బాగా దగ్గరని అమీన్పూర్ లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని చెప్పుకొచ్చాడు. మీ నిర్మాణం జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే న్యూస్ పేపర్లో వార్తలు రాయిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బెదిరింపులకు దిగిన విప్లవ సిన్హా పై కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఇవాళ ఉదయం 10.30 గంటలకు పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు.
Manjira River: నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం..