Site icon NTV Telugu

BJP MP Laxman: రేవంత్ రెడ్డి బీజేపీ మీద ఎదురుదాడి చేస్తున్నారు..

Laxman

Laxman

BJP MP Laxman: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక అయోమయ, గందరగోళంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ముసుగులో గత ప్రభుత్వంలోని బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారు.. ఆ ప్రాజెక్ట్ ఉత్తర భాగం రైతులకు నష్టం చేశారు అని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ రైతులకు న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించారు.. కానీ, ఇప్పటి వరకు న్యాయం చేయలేదు.. అలైన్ మెంట్ మార్చలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తర భాగం రైతులు అలైన్మెంట్ మార్చాలని అడిగితే పట్టించుకోని ముఖ్యమంత్రి.. దక్షిణ భాగంలో మాత్రం మార్చారు.. దీనిలో ఆంతర్యం ఎంటి.. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చాలని అనుకుంటున్నారా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.

Read Also: Pulivarthi Sudha Reddy: చెవిరెడ్డి.. ఇంకోసారి నాపై ఆరోపణలు చేస్తే మీ ఇంటికొస్తా!

ఇక, రిజనల్ రింగ్ రోడ్డ్ ప్రాజెక్ట్ డీపీఆర్ లోపభూయిష్టంగా ఉంది అని భారతీయ జనతా పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ మీద ఎదురు దాడి చేస్తున్నారు.. కేసీఆర్ చేసిన తప్పిదాలే ఆయన చేస్తున్నారు.. కేసీఆర్ కు పట్టిన గతే అతడికి పడుతుంది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది కాబోతుంది అని విమర్శలు గుప్పించారు.

Exit mobile version