BJP MLA Raja Singh: ఉస్మానియాను పేట్ల బురుజు కు షిఫ్ట్ చేయండి..
- గోషామహల్ గ్రౌండ్ కి ఉస్మానియా హాస్పిటల్ ను తరలించవద్దు..
- ఎంఐఎంకి భయపడి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారని కీలక వ్యాఖ్య..
- ఉస్మానియా ను పెట్ల బురుజు కు షిఫ్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA Raja Singh: ఉస్మానియాను పేట్ల బురుజుకు షిఫ్ట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. దీనిపై రాజాసింగ్ స్పందించారు. ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్ గ్రౌండ్ కి తరలించవద్దని అన్నారు. ఎంఐఎంకి భయపడి గోషామహల్‌కి షిఫ్ట్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియాను పేట్ల బురుజుకు షిఫ్ట్ చేయాలని కోరారు. గోషామహల్ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న బస్తీలకి ఇబ్బంది అవుతుందని రాజాసింగ్ అన్నారు. ఉస్మానియా హాస్పిటల్ ఉన్న స్థలంలోనే డెవెలప్ చేయాలని సూచించారు. మేయర్ పోస్ట్ పోతుందని విజయలక్ష్మి పార్టీ జంప్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోతి మార్కెట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని రాజాసింగ్ కోరారు.
Read also: CM Revanth Reddy: కేసీఆర్… అసెంబ్లీ సమావేశాలకు రండి, సలహాలు ఇవ్వండి..
Also Read
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
- Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ఇదిలా ఉండగా ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నా అవి ముందుకు సాగలేదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇక్కడ కొత్త భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. శంకుస్థాపన జరుగుతుండగా కొన్ని అడ్డంకులు రావడంతో పనులు నిలిచిపోయాయి. వారసత్వ కట్టడాల కంటే కొత్త కట్టడాలు ఎత్తుగా ఉండకూడదని, ఆ నిర్మాణాల ఛాయలు చారిత్రక కట్టడాలపై పడకూడదనే నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీంతో అప్పట్లో ఏడు ఎకరాల్లో నూతన భవనాల నిర్మాణానికి సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. అనంతరం వారసత్వ కట్టడాలకు ఇబ్బంది లేకుండా ఐదెకరాల స్థలంలో రెండు కొత్త భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Read also: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా ఇవ్వొద్దు..
అయితే అప్పటికి కూడా పనులు ప్రారంభం కాలేదు. ఉస్మానియాలో పర్యటించిన కేసీఆర్.. త్వరలోనే భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ఆచరణలో అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఇక్కడ ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరడంతో పూర్తిగా తాళం వేశారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో నూతనంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఏడెనిమిది అంతస్తులు నిర్మించాలని యోచిస్తున్నారు. కొత్త ఆసుపత్రిలో 750 నుంచి 1000 పడకలు ఉండే అవకాశం ఉంది. ఓపీ విభాగంతో పాటు ఇన్ పేషెంట్లకు అవసరమైన వార్డులు, బెడ్లు, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషన్ థియేటర్లు నిర్మిస్తామన్నారు. సీసీటీవీ నిఘా, అగ్నిమాపక రక్షణకు అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Konda Surekha: కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!