Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy: బడ్జెట్ను చూస్తుంటే.. ఆదాయం చరానా.. అప్పులు బరానా అన్నట్లు ఉంది..

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy: ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకొనే బడ్జెట్.. కేవలం 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా పెట్టారు బడ్జెట్ అని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉంది.. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి.. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉంది.. ఇన్ని రకాలుగా అప్పులు చేసిన ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారని అర్థం అయ్యింది.. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందు పర్చలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also: MLC Kavitha: బడ్జెట్లో ప్రవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ

ఇక, రైతు భరోసాకి నిధులు ఏ రకంగా సరిపోతాయనేది చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడిగారు. వ్యవసాయ కూలీలకు బడ్జెట్ కేటాయించకపోవడం బాదకరం అన్నారు. రైతులను మోసం చేసేలా ఉంది ఈ బడ్జెట్.. రైతులకు ఇచ్చిన హామీలు 42 వేల కోట్లు అవసరం.. ఆది ఎక్కడా బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే.. మరోసారి రైతులను మోసం చేయబోతున్నారని అర్థం అవుతుంది.. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నాం..
మైనారిటీలతో పోల్చుకుంటే 16 వేల కోట్లు బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది.. కానీ, 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారు.. అంటే మైనారిటీలపై ఉన్న ప్రేమ బీసీల మీద లేదా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. బట్టల వ్యాపారి దంపతుల హత్య.. కేర్ టేకర్‌పై అనుమానాలు

అయితే, బీసీలపై మీ చిత్త శుద్ధి ఏంటని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడిగారు. హామీలన్నీ ఎగవేసి తెలంగాణ ప్రజలను మోసం చేసే బడ్జెట్ లా ఉంది.. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు అని బడ్జెట్ లో పెట్టారు.. గత బడ్జెట్ లో కూడా 3500 ఇండ్లు అన్నారు ఇవ్వలేదు.. గత బడ్జెట్ లో తప్పు చేశామని ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. మోసం చేయడానికే బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. మరొసారి ప్రజలను మోసం చేయడానికే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

Exit mobile version