Site icon NTV Telugu

TG High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..

Telangana High Court

Telangana High Court

TG High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్‌కు ఉందని సూచించింది. అనర్హత పిటిషన్లపై 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. స్పీకర్‌కు టైమ్‌ బాండ్‌ లేదని ధర్మాసనం పేర్కొంది. పదో షెడ్యూల్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. కాగా, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్య దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Bhupalpally: హనుమాన్ విగ్రహానికి మంటలు.. స్థానికుల్లో ఆందోళన‌..

Exit mobile version