Site icon NTV Telugu

KA Paul: బెట్టింగ్‌ యాప్స్‌లో సెలబ్రిటీలపై కేసు.. బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా..?

Ka Paur

Ka Paur

KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేశా.. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, ఈ కేసులో బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. బాలకృష్ణ పైన కేసు ఎందుకు నమోదు చెయ్యరు?.. కూటమి ఎమ్మెల్యేలపై కేసు పెట్టలేదా? అని అడిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తుంది అని ఆరోపించారు. అలాగే, సిగాచి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓనర్లను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?.. ఇదే యూరోపియన్ దేశాల్లో జరిగి ఉంటే కఠిన చర్యలు ఉండేవి, ఇండియాలో మాత్రం బెయిల్స్ వస్తాయని కేఏ పాల్ సెటైర్లు వేశారు.

Read Also: Bihar Elections: గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం

అయితే, అదానీ, అంబానీలకు 15 లక్ష కోట్లు రుణమాఫీ చేస్తారు, కానీ పేదలకు మాత్రం ఏం చేయరు అని కేఏ పాల్ ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అమ్ముడు పోయారు.. సూపర్ సిక్స్ గురించి అడిగితే నాలుక కొస్తారా?.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని ప్రజలు కోరుకుంటే పెడుతాను అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఇక, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో పెట్టుకున్నట్లే అన్నారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. 5 శాతం లేని బీజేపీ 8 సీట్లు ఎలా గెలిచింది.. ఎందుకో తెలుసా.. బీఆర్ఎస్, ఈవీఎంల మహిమ వల్లే 8 ఎంపీ సీట్లలో గెలిచిందన్నారు. పురంధేశ్వరికి డిపాజిట్ కూడా రాకూడదు, కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు.

Exit mobile version