NTV Telugu Site icon

Bandi Sanjay: 50 ఏళ్లుగా హీరోలు వస్తున్నారు.. సెక్యురిటీ కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: అల్లు అర్జున్‌ను, సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి యత్నించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాతే సంధ్య థియేటర్ కు వచ్చినట్లు అల్లు అర్జున్ చెబుతున్నారు. అయినప్పటికీ సినిమా వాళ్లకు మించి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా సినిమా తరహాలో స్టోరీ అల్లడం విస్మయం కలిగిస్తోంది. పనిగట్టుకుని ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు పవిత్రమైన శాసనసభను వేదికగా మార్చుకోవడం మంచిది కాదన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏ మాత్రం సరికాదన్నారు.

Read also: GameChanger : ‘దోప్’ లిరికల్ సాంగ్ రిలీజ్.. చరణ్ డాన్స్ వేరే లేవల్

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయన్నారు. అదే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లడంలో అల్లు అర్జున్ సహా తెలుగు నటీనటులు, దర్శక నిర్మాతలు చేస్తున్నకృషి మరువలేమన్నారు. ‘సంధ్య’ థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోరుకోవాలని కోరుతూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ సమస్య ముగిసిన తరువాత కూడా ప్రజా సమస్యలను దారి మళ్ళించేందుకు కావాలనే సీఎం మళ్లీ ఆ సమస్యను తెరపైకి తేవడం విడ్డూరం.

Read also: Vijay Setupati : కింగ్ తో మ‌క్క‌ల్ సెల్వ‌న్.. డైరెక్టర్ ఎవరంటే ?

నిజానికి సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే. పైగా పాన్ ఇండియా సినిమా బెన్ ఫిట్ షోకు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం కూడా సాధారణమే. ఈ విషయం తెలిసి కూడా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలై, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే…. ఆ తప్పును ఇతరులపై నెట్టడటం సిగ్గు చేటు. పగబట్టినట్లుగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతోపాటు హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఒక రాత్రంతా జైల్లోనే ఉంచడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం.

Read also: Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్‌ ముఖ్యం కాదు!

తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేస్తున్నా. మీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ గురుకులాల్లో విషాహారం తింటూ విద్యార్థులు చనిపోతుంటే మీరెందుకు బాధ్యత వహించడం లేదు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాము కాటుకు గురై నిత్యం విద్యార్థినీ విద్యార్థులు ఆసుపత్రుల పాలై చనిపోతుంటే మీతోపాటు బాధ్యులైన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? మీకు ఒక న్యాయం? ఇతరులకు ఒక న్యాయమా?’’ ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తోపాటు సినిమా ఇండస్ట్రీ విషయంలో కక్ష సాధింపు చర్యలను వీడాలన్నారు.

Read also: Unstoppable S4: అన్‌స్టాప‌బుల్ ఎంట‌ర్టైన్‌మెంట్‌ కోసం బాలయ్యతో వెంకీ మామ రెడీ!

చట్టం చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్లుగా వినియోగించాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎలాంటి రాజకీయ విలువలు లేని ఎంఐఎం వాళ్లతో శాసనసభలో ప్రశ్న అడిగించుకుని మరీ సమాధానం ఇవ్వడం సిగ్గు చేటు. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచన చేరి ఆర్ధిక ప్రయోజనం పొందడం ఒవైసీ సోదరులకు అలవాటే. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచారు. ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరారు. కాంగ్రెస్ కు అదే గతి పడుతుంది.
Jishnu Dev Varma: వందేళ్ల వేడుకకు రావడం సంతోషంగా ఉంది.. మెదక్ చర్చిపై గవర్నర్ సందేశం..

Show comments