Vijay Setupati : తమిళ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఆయనకు ప్రత్యేకమైనటు వంటి ఇమేజ్ ఉంది. హీరో అయినా విలన్ అయినా ఆ పాత్రలోకి ఆయన దూరనంత వరకే. అతడు ఎంటర్ అయితే ఆ సినిమా రూపు రేఖలు మారిపోవాల్సిందే. డిమాండింగ్ యాక్టర్ గా సేతుపతికి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన నటుల్లో ఆయన ఒకరు. ఇండియాలో ఉన్న దర్శకులంతా అతడితో పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోలంతా తమ సినిమాల్లో సేతుపతి విలన్ గా నటిస్తే బాగుండని ఆశిస్తారు. అలా ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ నటుడిగా విజయ్ సేతుపతికి గుర్తింపు ఉంది. అంతటి క్రేజీ స్టార్ కింగ్ నాగార్జున సినిమాలో నటించడానికి ఆసక్తిని వ్యక్తం చేయడం విశేషం. అవును బిగ్ బాస్ షో వేదికగా విజయ్ సేతుపతి ఆ విధంగా ఓపెన్ అయ్యాడు. మంజువారియర్ తో కలిసి సేతుపతి నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలేకి హాజరయ్యారు.
Read Also:Unstoppable S4: అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్‌మెంట్ కోసం బాలయ్యతో వెంకీ మామ రెడీ!
ఈ సందర్భంగా ముందుగా మంజువారియర్ నాగ్ సర్ తో పని చేయాలని ఉందన్నారు. దీంతో విజయ్ సేతుపతి నేను కూడా ఆయనతో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వీలు పడలేదు. ఈ సారి ఛాన్స్ వస్తే మిస్ చేసుకోనని చెప్పుకొచ్చారు. ఇంత వరకూ విజయ్ సేతుపతి ఫలానా నటుడి సినిమాలో చేయాలని ఉందని అని ఎక్కడా చెప్పింది లేదు. తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు వేటికి సైన్ చేయలేదు. సరైన కథలు రావడం లేదని, పాత్రలు రావడం లేదని అందుకే కమిట్ అవ్వడం లేదన్నారు దీంతో సేతుపతిపై విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కావాలనే సినిమాలు చేయలేదని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే విలన్ పాత్రలు మాత్రం చేయనని ఓ సందర్భంలో అన్నారు. మరి ఆ మాటకు కట్టుబడి విలన్ ఆఫర్లు వచ్చినా? వద్దనుకుంటున్నారేమో.
Read Also:Unregulated lending: లోన్‌యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం షాక్!