AP Deputy CM: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను పవన్ అందజేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకే విరాళం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Beer Party In School: పాఠశాలలో బీర్ పార్టీని చేసుకున్న బాలికలు..
అయితే, అంతకుముందు తెలంగాణ సీఎం సహయానిధికి కోటి రూపాయిలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయిలతో పాటు ముంపుకి గురైన సుమారు నాలుగు వందల గ్రామాలకు ఒక లక్ష చెప్పున ఒక్కో పంచాయితీకి అత్యవసర నిధి కింద నాలుగు కోట్లు విరాళాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలబడ్డారు. ఏపీ సీఎం సహాయనిధికి తమ ఒక్క రోజు జీతాన్ని విరాళంగా అందించారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ పవన్ కళ్యాణ్ ని కలిసి 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒక్క రోజు మూల వేతనం రూ. 14 కోట్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ. 75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు రూ. 10 లక్షలు ఏపీ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించాయి.