Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. చిన్నారులపై రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల దాడులు..

Hyd

Hyd

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పిల్లలపై కుక్క కాట్ల ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు హయత్‌నగర్‌లో ప్రేమ్‌చంద్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు వెంటనే 108కి కాల్ చేసి ఆ చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఇక, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Read Also: Samantha Ex Makeup Artist: ఎన్నైనా తిట్టండి కానీ..సమంత ఫాన్స్’కి మేకప్ ఆర్టిస్ట్ వార్నింగ్

అయితే, ఘటన జరిగిన కూడా ఇప్పటికీ జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు పట్టించుకొని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాబుకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పుడు మేల్కొని జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేస్తున్నారు. ఈరోజు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబుని చూడటానికి అధికారులు వెళ్లారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్క చేయని వెటర్నరీ విభాగం అధికారులు.. హాస్పిటల్స్, స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఉన్న కుక్కలను తరలించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఎనిమల్ బర్త్ కంట్రోల్ కోసం ప్రతి కుక్కకు 1500 రూపాయలను జీహెచ్ఎంసీ అధికారులు ఖర్చు చేస్తుంది. కానీ ఎక్కడా తగ్గని కుక్కల బెడద పెరిగింది.

Exit mobile version