Site icon NTV Telugu

Kharge Serious On MLAs: ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఖర్గే సీరియస్‌.. గ్రూపులు కడితే భయపడేది లేదు..

Kharge

Kharge

Kharge Serious On MLAs: హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీరియస్ అయ్యారు. నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతారు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను రాహుల్ గాంధీ.. నేను పట్టించుకోమని తేల్చి చెప్పారు.

Read Also: Minister Anagani Satya Prasad: భూముల రీ సర్వే.. ఆగస్టు 15న కొత్త పాస్‌ బుక్స్‌..

మరోవైపు, జడ్చర్ల నియోజక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై పీసీసీ సీరియస్ అయింది. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటి సమావేశంలో అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల జడ్చర్లలో కీలక కామెంట్స్ చేసిన అనిరుద్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ కోవర్టులున్నారని వ్యాఖ్యాలు చేశారు. ఇరిగేషన్, రోడ్ల కాంట్రాక్టులు అవ్వడం మానేస్తే.. అంతా సెట్ అవుతుందన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నాడు.

Exit mobile version