Site icon NTV Telugu

ACB Raids: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఆరు నెలల్లో 126 కేసులు

Acb

Acb

ACB Raids: తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారులను కటకటాల పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో లంచాలు తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారే టార్గెట్ గా తనిఖీలు చేసిన అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా, తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. మారుమూల ప్రాంతాల నుంచి కంప్లైంట్ వస్తే.. అక్కడికి వెళ్లి లంచగొడ్డిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తగిన శిక్షలు విధిస్తున్నారు.

Read Also: SC-ST reservation: సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాల్లో తొలిసారి SC-ST రిజర్వేషన్..

ఇక, జనవరి నుంచి జూన్ వరకు కేవలం 6 నెలల్లో 126 కేసులు నమోదు చేసింది ఏసీబీ. జూన్ నెలలో 31 కేసులు నమోదు కాగా, అందులో 15 ట్రాప్, 2 అక్రమాస్తుల కేసు, 3 క్రిమినల్ దుష్ప్రవర్తన, 4 రెగ్యులర్ కేసులు, 7ఆకస్మిక తనిఖీల కేసులు ఉన్నాయి. ఏసీబీ కేసుల్లో అరెస్ట్ అయిన ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులు జ్యూడిషల్ రిమాండ్ కు తరలించారు. ఏసీబీ ట్రాప్ కేసులో 3.43 లక్షల రూపాయల డబ్బు సీజ్ చేయగా.. రెండు అక్రమ ఆస్తుల కేసులో 13.50 లక్షల ఆస్తులు, 5.22 లక్షల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Telangana CM: తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు..

అయితే, ఆర్టీఏ, సబ్ రిజిష్టర్ తనిఖీల్లో లెక్క చూపని రూ. 2.72 లక్షలు సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. 6 నెలల్లో 80 ట్రాప్ కేసులు, 8 అక్రమాస్తుల కేసులు, 14 క్రిమినల్ దుష్ప్రవర్తన, 10 రెగ్యులర్ ఎంక్వైరీలు, 11 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ఇందులో 8 మంది అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులతో సహా 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ట్రాప్ కేసుల్లో 24.57 లక్షల మొత్తం స్వాధీనం చేసుకోగా.. డీఏ కేసులలో 27.66 లక్షల విలువైన ఆస్తులను వెలికి తీశారు.. ఆర్టీఏలో జరుగుతున్న అక్రమలపై ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

Exit mobile version