Site icon NTV Telugu

Crime News: కన్న తల్లినే హతమార్చేంత క్రూయల్‌గా మారిన కూతురు!

Jeedimetla

Jeedimetla

Crime News: బిడ్డ కంట్లో నలుసు పడినా.. ఆ కన్నతల్లి గుండె తల్లడిల్లింది ! తాను పస్తులున్నా సరే.. బిడ్డ ఆకలి తీర్చేందుకు ఎంత కష్టాన్నైనా భరించింది ! తండ్రి లేని లోటు రానివ్వకుండా రెక్కల కష్టంతో బిడ్డలను కంటికిరెప్పలా చూసుకుంది.. కానీ ఆ తల్లికి అర్థం కాలేదు.. తాను పాలుపోసి పెంచుతోంది ఓ విషనాగును అని !! కన్న తల్లిని కర్కషంగా హతమార్చింది ఆ కిరాతక కూతురు !! పట్టుమని 16 ఏళ్లు కూడా నిండని ఆ కూతురి క్రిమినల్‌ మైండ్‌.. క్రైమ్‌ కథాచిత్రాలనే తలదన్నేలా ఉంది. ఇంతకూ ఎవరా డేంజర్‌ డాటర్‌..? కన్న తల్లినే హతమార్చేంత క్రూయల్‌గా ఎందుకు మారింది..? ఇదీ ఇవాల్టి రియల్‌ స్టోరీ…

Read Also: Bihar Elections: బీహార్‌లో యంగ్ ఓటర్లే అధికం.. ఈసారి ఎటువైపో..!

తల్లీ తండ్రీ తానే అయి తన ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకుందో అమ్మ!! తాను పడుతున్న కష్టాలన్నీ పంటికింద దిగమింగి.. కూతుళ్లకు ఏ కష్టం రాకుండా పెంచింది. తన రెక్కల కష్టంతో ఇద్దరినీ ఉన్నంతలో గొప్పగా చదివించింది!! కూతుళ్లే సర్వస్వంగా బతికింది. కానీ… కళలో కూడా ఊహించని ఘోరం జరిగింది. కళ్లలో పెట్టుకుని చూసుకున్న కూతురు చేతిలోనే ఆ తల్లి కిరాతకంగా హతమైంది. చున్నీతో మెడకు బిగించి.. ఊపిరాడకుండా చేసింది. అయినా చనిపోలేదని నిర్ధారించుకుని తలను సుత్తితో మోది.. కత్తితో పీక కోసి చంపింది.

Read Also: Story Board: రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతుందా? కొనుగోలు శక్తి తగ్గిపోయిందా?

నగరం నడిబొడ్డున.. జీడిమెట్ల పరిధిలో జరిగిన ఈ దారుణ హత్య సంచలనం రేపుతోంది!! పట్టుమని పదహారేళ్లు కూడా నిండని కూతురు కన్న తల్లినే హతమర్చిందన్న వార్త అందరనీ ధడ పుట్టిస్తోంది. అది కూడా ప్రియుడు, ప్రియుడి తమ్ముడితో కలిసి కిరాతకంగా హత్య చేయడం షాక్‌ కి గురి చేస్తోంది. ప్రియుడి వయసు కూడా 19 ఏళ్లు… వాడి తమ్ముడి వయసు 18 ఏళ్లు. చిన్న వయసులోనే వీరి క్రిమినల్‌ మైండ్‌కి పోలీసులూ నివ్వెరపోతున్నారు.

Read Also: NIA: విజయనగరం ఉగ్రకుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ!

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం షాపూర్‌నగర్‌ పరిధిలోని న్యూ ఎల్బీనగర్‌ లో అంజలి అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటోంది. అంజలి మొదట భర్తకు పెద్ద కూతురు తేజశ్రీ జన్మించగా.. కొన్నేళ్లకు భర్త చనిపోయాడు. ఆ తర్వాతి మూడేళ్లకు అంజలి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కూడా కూతురు పుట్టింది. కొన్నాళ్లకు రెండో భర్త కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దురదృష్టం అంజలిని వెంటాడింది. పెద్ద కూతురు తండ్రి లేని పిల్లలా ఉండొద్దని రెండో పెళ్లి చేసుకుంటే… అంజలిని విధి వెంటాడింది. రెండో భర్త కూడా చనిపోవడంతో… తాను ఒంటరి ఆడది అవడమే కాకుండా… ఇద్దరు కూతుళ్లూ తండ్రి లేని పిల్లలయ్యారు. విధిని ఎదిరించింది అంజలి. తన రెక్కల కష్టంతో ఇద్దరు పిల్లలను తండ్రి లేని లోటు రాకుండా పెంచింది. అంజలి స్వతంత్ర్య సమరయోధురాలు చాకలి ఐలమ్మ మునిమనుమరాలు కావడంతో… అంజలి కూడా కళలు, సంస్కృతిక కార్యక్రమాలవైపు మళ్లింది. ఉద్యమ గేయాలు పాడుతూ… డబ్బులు సంపాధించేది. తెలంగాణ సాంస్కృతిక కళా సారథిలో ఉద్యోగం కూడా సంపాధించింది.

Exit mobile version