NTV Telugu Site icon

Hyderabad Crime: కన్న తల్లిని రోడ్డుపై వదిలి వెళ్లిపోయిన కొడుకు.. ఆకలి తట్టుకోలేక తల్లి మృతి..

Hyderabad Srime

Hyderabad Srime

Hyderabad Crime: నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మను నమ్మించి నడిరోడ్డుపై వదిలేశాడు ఓ కొడుకు. తన కొడుకు వస్తాడని.. తీసుకుని వెళతాడని తన కన్నపేగుకోసం రెండు రోజులు ఎదురుచూసింది తల్లికి నిరాశే మిగిలింది. ఆ రెండు రోజులు తిండిలేక ఆకలితో అలమటించింది. స్థానిక సమాచారంతో ఆపస్మారక స్థితిలో ఉన్న శ్యామలను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కన్నకొడుకును చూడాలనే ఆశతోనే ప్రాణాలు వదిలింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Read also: Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్‌ అప్‌డేట్స్‌

మేడ్చల్ చేపల మార్కెట్ వద్ద నివాసం ఉంటున్న అరవింద్ కన్న తల్లి శ్యామల(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈ నెల 5వ తేదీన అరవింద్ తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి బోయినపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎంఎంఆర్ గార్డెన్ వద్ద ఫుట్ పాత్ పై వదిలేసి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కానీ రెండు రోజులు గడిచినా తిరిగి రాలేదు. దీంతో ఆకలితో అలమటిస్తున్న తల్లి అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికుల సమాచారం మేరకు బోయినపల్లి పోలీసులు ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్ ఐ శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్‌తో నల్లాలను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్యామల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.

Read also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

కొడుకుని చూడాలని శ్యామల కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపడంతో.. పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఇంతలోనే ఆమె కన్ను మూసింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కానీ మృతురాలు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ లో దర్యాప్తు చేసిన ఆమె కుమారుడు అరవింద్ ఆచూకీ లభించలేదు. బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. శ్యామల వివరాలు తెలిసిన వారు ఎవరైన తన కొడుకును తీసుకుని రావాలని చివరి చూపైన తల్లిని చూడాలని కోరారు. శ్యామల కుటుంబ సభ్యులు ఎవరైనా వుంటే వాఉ బోయిన్‌పల్లి పోలీసులను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి వెల్లడించారు.
Parliament Sessions: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు! రికార్డు నుంచి తొలగింపు