Telangana Assembly 2024 LIVE UPDATES: నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యాయి. నేడు సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశంలో 19 పద్దులపై చర్చ జరుగుతుంది. మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమంపై నేడు చర్చ జరగనుంది. సాగునీరు, పౌర సరఫరాల సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. దేవాదాయ, అటవీ శాఖల సమస్యలపై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మాతా శిశు సంక్షేమంపై సభలో చర్చించనున్నారు.
అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. శాసనసభ అరగంటపాటు వాయిదా అనంతరం అసెంబ్లీ ప్రారంభమైంది. రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా.. అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.
శాసనసభ అరగంటపాటు వాయిదా పడింది. రుణమాఫీ కార్యక్రమంలో సభ్యులంతా పాల్గొనాలని స్పీకర్ కోరారు.
అసెంబ్లీని స్పీకర్ అరగంట వాయిదా వేశారు.
40 వేల దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేసీఆర్ ఆర్థిక సాయం అందించాం. కాంగ్రెస్ పార్టీ దళితబంధు కింద 12 లక్షలు అందిస్తామని చెప్పి బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా మోసం చేసింది. విద్యా జ్యోతి పథకం పేరుతో 10 పాసైన విద్యార్థులకు 10 వేలు, 12 పాసైన విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ పాసైన విద్యార్థులకు 25 వేలు, పీజీ పాసైన విద్యార్థులకు రూ. లక్ష, పీహెచ్‌డీ పాసైన విద్యార్థులకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి కేటాయింపులు చేయలేదు. ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. 15 ఏండ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. వాటికి కేటాయింపులు లేవు అని అనిల్ జాదవ్ తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వంలో మా సమస్యలు ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు మంత్రి లేకపోవడం.. వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రజలకు అర్థమైతుంది. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ వాటి అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని అనిల్ జాదవ్ తెలిపారు.
ఉద్యోగాల్లో కేసీఆర్ 95 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు కూడా కేసీఆర్ పెంచారు. స్పోర్ట్స్ స్కూల్స్‌లో స్టాఫ్ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. అన్ని గురుకులాలు, మోడల్స్ స్కూల్స్‌లో అదనపు గదులను నిర్మాణం చేయాలి అని ప్రభుత్వాన్ని అనిల్ జాదవ్ కోరారు.
జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అతిగతీ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామన్నారు. గ్రూప్- 2లో 2 వేలు, గ్రూప్- 3లో 3 వేల పోస్టులు పెంచుతామన్నారు. కానీ అమలు చేయడం లేదు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కుల గుణన చేసి మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. మైనార్టీ బడ్జెట్ 4 వేల కోట్లకు పెంచి సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. కానీ 2258 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు బడ్జెట్‌లో. మైనార్టీల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని ఆయన పేర్కొన్నారు.
ఎస్టీలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ఊసే లేదు. కార్పొరేషన్లకు 25 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్సెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఎంతో కష్టమని చెప్పి కల్యాణలక్ష్మి కింద లక్ష కట్నం అందించి కేసీఆర్ ఆదుకున్నారు.
గిరి వికాస్ పథకం కింద అన్ని ఎస్టీ కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చామని ఎమ్మెల్యే అనిల్ చెప్పారు. పోడుభూముల పంపిణీలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని సీతక్క మండిపడ్డారు. తన తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడుభూముల హక్కు వచ్చిందని తెలిపారు. అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు తనవని సీతక్క చెప్పారు.
ఎస్టీలకు పోడు భూముల చట్టం ద్వారా 2006లో లబ్ధి కలిగించామని మంత్రి సీతక్క తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీలకు మీరేమీ చేయలేదని బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ విమర్శించారు. పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి అని డిమాండ్ చేశారు.
శాసనసభలో పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును సభ ముందుంచారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి, ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
అసెంబ్లీలో ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ - పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిందని తెలిపారు. రైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదన్నారు. పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగిందని తెలిపారు.
రేపు ద్రవ్య వినిమయ బిల్లు పెడుతున్నారు. ఈ సమావేశాలు అయిపోయాయి. కానీ వచ్చే అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల్లో రోజుకు 19 పద్దులు పెట్టకుండా, 2 లేదా 3 పద్దులపై సావధానంగా చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలి. మంత్రులు కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే సెషన్‌ను అవసరమైతే 20 రోజులు పెట్టాలి. మా వైపు నుంచి తప్పకుండా కో ఆపరేషన్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సభను నడిపారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనను అంగీకరిస్తున్నాము. కానీ ఈ సభలో 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు.. వారందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇలా రోజుకు 19 పద్దులపై చర్చ పెట్టకుండా.. రోజుకు 2 లేదా 3 పద్దులపైన చర్చ పెట్టాలని కోరుతున్నాం.
లంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సందేశం ఇచ్చారు. నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని స్పీకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఒక్కో సభ్యునికి 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. అనే అంశంపై మాట్లాడాలని సభ్యులందరూ సభ్యులకు సూచించారు.
ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించబోయే లక్ష నుండి లక్షన్నర వరకు రుణమాఫీ పథకం ప్రారంభోత్సవ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.
శాసనసభలో 19 డిమాండ్లపై చర్చ కొనసాగుతోంది. స్కిల్ వర్సిటీ బిల్లును సభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.
ఆరవ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు