TGS RTC: భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బస్సులను రద్దు చేశారు. ఆదివారం రాత్రి వరకు 877 బస్సులను రద్దు చేశారు. అదేవిధంగా సోమవారం ఉదయం నుంచి 570 బస్సులను రద్దు చేశారు. ప్రధానంగా మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. ఇవాళ (మంగళవారం) కూడా ఆయా రూట్లలోని రోడ్లన్నీ జలమయం కావడంతో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 1400కు పైగా బస్సులను టీజీఎస్ ఆర్టీసీ రద్దు చేసింది. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ బస్సులను నడుపుతామని చెప్పారు. మరికొన్ని బస్సులను దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు.
Read also: Heavy Rain: వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..
రంగారెడ్డి ఆర్ ఎం శ్రీలత మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో 212 బస్సులకు బదులు 50 బస్సులు మాత్రమే ముంపునకు గురవుతున్నాయన్నారు. ఇటీవల వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు. కాగా.. ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా.. నేటి నుంచి వచ్చే 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?