Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic Alert: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (మే 10) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరవుతున్న నేపథ్యంలో.. నగరంలో వీవీఐపీ (VVIP) కదలికల దృష్ట్యా పోలీసులు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఒక ప్రకటనలో వెల్లడించారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ..
ప్రధాని ప్రయాణించే మార్గాల్లో సాధారణ ప్రజలు ప్రయాణించవద్దని పోలీసులు సూచించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ – గ్రీన్‌ల్యాండ్స్ – పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ – NFCL జంక్షన్ – SNT జంక్షన్ – సాగర్ సొసైటీ, NTR భవన్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ – పెద్దమ్మ తల్లి ఖమాన్, రోడ్ నెం. 36/31 – నీరూస్ జంక్షన్ – సైబర్ టవర్స్ జంక్షన్, శిల్పారామం – హైటెక్స్ ఖమాన్ – NAC మెయిన్ గేట్ – కాసాని గేట్ – HICC ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పారు. సభ దృష్ట్యా సికింద్రాబాద్ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో M.G. రోడ్, R.P. రోడ్, S.D. రోడ్ల వైపు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ప్రయాణీకులకు ముఖ్య సూచనలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన ప్రయాణీకులు ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా వారి వారి ఇళ్ల నుంచి చాలా ముందుగా బయలుదేరాలని పోలీసులు కోరారు. రోడ్డు మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, సాధ్యమైనంత వరకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయవచ్చని చెప్పారు. అలాగే ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం కలిగితే సోషల్ మీడియా వేదికల (ట్విట్టర్:https://twitter.com/HYDTP, ఫేస్బుక్: https://facebook.com/HYDTP/) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రధాని పర్యటన ప్రశాంతంగా జరిగేందుకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నగర పౌరులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ కోరారు.

🚨 TRAFFIC ADVISORY 🚨
In view of the Hon’ble Prime Minister’s visit and Public Meeting at Parade Grounds, Secunderabad on 10.05.2026, traffic diversions and restrictions will be in force on roads leading towards the venue due to VVIP movement and large public gatherings.
⚠️… pic.twitter.com/QWSYsWT7zw
— Malkajgiri Police (@MalkajgiriCop) May 9, 2026
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!