Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
- దోమలగూడ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు
- కాచిగూడ రైల్వే స్టేషన్లో CCTVలో కనిపించిన దృశ్యాలు
- ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం
- సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Girls: నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కుటుంబాలకు చెందిన స్నేహ కుమారి, లలిత కుమారి, లత అనే ముగ్గురు బాలికలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్డు వద్ద వీరు ఆటో ఎక్కినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత రూట్‌ను ట్రాక్ చేయగా, సదరు బాలికలు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆటో దిగినట్లు అక్కడి సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.
బాలికలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని మరికొన్ని సీసీటీవీ విజువల్స్‌ను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బాలికలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు పిర్యాదు చేసి సహకరించాలని అధికారులు ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!