Site icon NTV Telugu

Cyber Fraud : ఫేస్‌బుక్ మోసం.. 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి రూ.38 లక్షల చీటింగ్

Cyber Crime

Cyber Crime

Cyber Fraud : 70 ఏళ్ల ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అనగానే.. జీవితంలో చాలా అనుభవాలున్న పెద్దమనిషి అనిపించాలి కదా.. కానీ డిజిటల్ మోసాలకి వయస్సు అడ్డుకాదన్నట్టు, ఫేస్‌బుక్‌లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో అతని విశ్రాంత జీవితం తలకిందులైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ రిటైర్డ్ ఉద్యోగికి ఓ యువతి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పంపింది. తాను పేద కుటుంబానికి చెందినవని చెప్పి వైఫై కనెక్షన్ కోసం రూ.10,000 సహాయం అడిగింది. మానవత్వంతో స్పందించిన బాధితుడు డబ్బులు పంపించడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

ఆ తర్వాత యువతి తల్లి, చెల్లి పేర్లతో మరో రెండు ఫేస్‌బుక్ ఖాతాల నుంచి బాధితుడికి మెసేజ్‌లు వచ్చాయి. ఇందులో మైనర్ బాలికను లైంగికంగా వేధించారని, అసభ్యకర సందేశాలు పంపారని పేర్కొంటూ బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ‘మీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’, ‘కేసు నమోదైంది’, అంటూ తనను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసుల పేరుతో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పాత్రలు పోషిస్తూ మరిన్ని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ విడతలవారీగా డబ్బులు వసూలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి మొత్తం రూ. 38,73,000 రూపాయలు చీటర్లు దోచుకున్నారు.

అంతలోనే మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, డబ్బుల లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది. ప్రత్యేకించి పెద్దవారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Toxic : కియార కోసం.. ‘టాక్సిక్‌’ మూవీ సెట్స్‌ ముంబైకి షిఫ్ట్‌ చేసిన యష్..

Exit mobile version