NTV Telugu Site icon

New Kind of Fraud: కొత్త తరహా మోసం.. దొంగతనం చేస్తారు ఓఎల్ఎక్స్‌లో అమ్ముతారు

Tractor Chori

Tractor Chori

New Kind of Fraud: ఇప్పటికే మార్కెట్ లో రకరకాల దొంగలు తమ చేతివాటం చూపి ప్రజలను దోచుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎంత మంది బలి అయినా.. కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా అన్నట్లు కొత్త దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. మార్కెట్‌లోకి కొందరు విచిత్ర దొంగలు వచ్చారు. కొత్త తరహా దొంగతనాలతో రైతులు టెన్షన్ పడుతున్నారు. కానీ.. వాళ్లు దోచుకునేది ద్విచక్ర వాహనాలు, నగదు, బంగారం కాదండోయ్.. ట్రాక్టర్లకు ఉండే ట్రాలీలు కొట్టేస్తున్నారు. పొలాల దగ్గర పార్క్ చేసిన ట్రాలీలు ఉంటే చాలు రాత్రికి రాత్రే చూసి.. రాత్రికి రాత్రే వాటిని దోచేయడయే కాకుండా.. దానిని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అమ్మేయడం.ఇది ఎక్కడో కాదండోయ్.. మన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.

ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న సంపంగి మహేశ్, ఉర్సు వెంకన్నలు ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీని కోసం కొట్టేసేందుకు ఈజీగా ఉన్న ట్రాక్టర్ ట్రాలీలను ఎంచుకున్నాడు. ఇక ట్రాలీలైతే.. ఊరికి దూరంగా పొలాలు, బావుల దగ్గర పార్క్ చేస్తారు కాబట్టి.. సులువుగా కొట్టేయొచ్చని ప్లాన్ వేశాడు. ఇదే విషయం వెంకన్నకు చెప్పగా తను కూడా ఒప్పుకున్నాడు. ఇంకేముంది.. ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు.. బావులు, పొలాల దగ్గర ట్రాక్టర్ ట్రాలీలు కనిపిస్తే రాత్రి వేళల్లో ఇంజన్ల సాయంతో వాటిని దొంగతనం చేయడం ప్రారంభిస్తారు. అయితే.. నేరుగా విక్రయిస్తే.. ఎవరికైనా అనుమానం వస్తుందని భావించి సెకండ్ హ్యాండ్ కింద.. ఓఎల్‌ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో విక్రయించి.. సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు.

అయితే.. గతేడాది అక్టోబర్‌లో మొదలైన ఈ చోరీలు.. ఎవరికీ దొరకకుండా చక్కగా నడిపించారు. అయితే.. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలంలో డిసెంబర్ 31న గ్రామం చివరన ట్రాక్టర్ ట్రాలీ చోరీకి గురైంది. ట్రాలీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20 లక్షల విలువైన 13 ట్రాక్టర్ ట్రాలీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ వీరు చేసిన చోరీల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10, నల్గొండలో ఒకటి, నాగర్ కర్నూల్ లో ఒకటి కేసులు నమోదయ్యాయి.
Pakistan : బలూచిస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం

Show comments