New Year Party Permissions: కొత్త సంవత్సరం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది. పార్టీలు, పబ్ ల్లో ఎంజాయ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దమతున్నారు. అయితే, కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారు ముందుగా అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. అయితే.. హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యానిటీలతో సహా నగర ఈవెంట్ నిర్వాహకులు ఉదయం 1గంట వరకు మాత్రమే కొత్త సంవత్సరం పార్టీలను ప్లాన్ చేయడానికి అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ఈనేపథ్యంలో దీనికోసం ముదస్తు అనుమతులకు దరకాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలకు రాచకొండ పోలీసుల ఆదేశాల మేరకు పార్టీలు, ఇతర కార్యక్రమాల నిర్వాహకులు డిసెంబర్ 23 సాయంత్రం 5.00 గంటలకు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Read also: Julakanti Brahma Reddy: మా ఇళ్లను మేమే తగులబెట్టుకుంటామా?
ఒకవేళ అనుమతులు లేకుండా కొత్త సంవత్సర పార్టీలు, వేడుకలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. డిసెంబర్ 23 న లేదా అంతకంటే ముందు రాతపూర్వక దరఖాస్తులను రాచకొండ, నేరేడ్‌మెట్‌లోని ఇన్‌వార్డ్ సెక్షన్‌లోని పోలీస్ కమీషనర్ కార్యాలయంలో సమర్పించాలని ప్రకటన పేర్కొంది. ఇక.. కొత్త సంవత్సర కార్యక్రమాలన్నీ జనవరి 1, 2023 తెల్లవారుజామున 1 గంటలోపు ముగించాలని కోరారు. అయితే.. సమయంతో పాటు, పెద్దల కోసం ఉద్దేశించిన పార్టీకి మైనర్‌లు ఎవరూ హాజరుకాకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా.. లీసు అధికారుల ప్రకారం, జంటల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలో మైనర్లను అనుమతించకూడదన్నారు. కాగా.. హాజరైన వారి వయస్సు తప్పనిసరిగా ప్రవేశించినప్పుడు ధృవీకరించబడాలి. వారి చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుల కాపీని పొందడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
Read also: NBK108: బాలయ్య కోసం రంగంలోకి విలక్షణ నటుడు.. ఫోటో లీక్ చేసిన డైరెక్టర్
ఎవరైతే పార్టీలకు వస్తారో వారి వయస్సును నిర్ధారించడానికి, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుల కాపీని తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు. కాగా.. నిఘా ఉండేలా వేదిక వద్ద కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను అధికారులు కోరారు. అంతేకాకుండా.. గాయకులు, ప్రదర్శకులు ఈవెంట్‌లలో భాగం అయినప్పటికీ.. ఎటువంటి అసభ్యత అనుమతించబడదన్నారు. ఇకపార్టీలో శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు, సంగీత కార్యక్రమాల సౌండ్ ఈవెంట్ ప్రాంగణం దాటి వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా.. ప్రజలకు భంగం కలిగించే విధంగా లేదా.. వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించే లేదా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఏదైనా చర్యలో పాల్గొన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఇప్పటికే న్యూఇయర్ వేడకుల్లో భాగంగా.. హైదరాబాద్‌లో ‘బుక్‌మైషో’ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు జాబితా చేయబడిన అత్యంత ఖరీదైన ఎంట్రీ టికెట్ రూ. 6490 నుండి ప్రారంభమైంది.
NBK108: బాలయ్య కోసం రంగంలోకి విలక్షణ నటుడు.. ఫోటో లీక్ చేసిన డైరెక్టర్