Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్
- చార్మినార్ వద్ద ఉద్రిక్త ఘటన
- అధికారుల విధులకు అడ్డుపడ్డ సాహిల్
- పోలీసులతో వాగ్వాదం, తోపులాట
- కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాతబస్తీలో చార్మినార్ సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కుమారుడు మహమ్మద్ సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు పోలీసుల బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అధికారుల పనిని అడ్డుకున్న సాహిల్, వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను , జీహెచ్‌ఎంసీ సిబ్బందిని తోసేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు.
SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..
Also Read
శాంతిభద్రతలను కాపాడాల్సిన చోట, ఒక ప్రజాప్రతినిధి కుమారుడై ఉండి అధికారులపైనే సాహిల్ చేయి చేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, పోలీసులను తోసేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ అధికారుల పట్ల సాహిల్ ప్రవర్తించిన తీరుపై పోలీసులు తక్షణమే స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం , అధికారులపై దాడికి ప్రయత్నించినందుకు గాను సాహిల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!