Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..
- ట్రంప్ ఒక పిచ్చివాడు అతడిని ఆపండి..
- ఫ్రాన్స్, రష్యా, చైనాలను కోరిన ఐఏఈఏ మాజీ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం పెరిగింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు ఆదివారం ట్రంప్ భారీ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి, త్వరగా మాతో డీల్ చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్‌ను నరకంగా మారుస్తామని, సమయం లేదని హెచ్చరించారు.
Read Also: Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..
Also Read
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
అయితే, ట్రంప్ హెచ్చరికలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) మాజీ డైరెర్టర్ మొహమ్మద్ ఎల్బరాడెయ్ స్పందించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని గల్ఫ్, ఐక్యరాజ్యసమితి(యూఎన్)ను కోరారు. ఎల్బరాడెయ్ తన ఎక్స్ పోస్టులో .. ‘‘ మరోసారి ఈ పిచ్చివాడు ఈ ప్రాంతాన్ని అగ్నిగోళంగా మార్చకముందే అతడిని ఆపడానికి మీ శక్తి మేరకు పనిచేయండి’’అని అన్నారు. ఎల్బరాడెయ్ ప్రాంతీయ నాయకులనే కాకుండా ప్రపంచసంస్థల్ని కూడా ప్రశ్నించారు. భద్రతామండలి, యూఎన్ చీఫ్ ఆంటోనియో గెటెర్రస్, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు కలుగజేసుకోవాలని ఆ దేశ అధ్యక్షులను ట్యాగ్ చేశారు.
యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇటు అమెరికా, అటు ఇరాన్ ఒకరికొకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ యుద్ధంలో ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్‌లపై విరుచుకుపడుతోంది. ఈ దేశాల్లో గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు చేస్తోంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 20 శాతం చమురు రవాణాకు కీలకంగా ఉన్న ఇరుకైన జలమార్గం ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది.
తాజావార్తలు
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
-
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
-
iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..