Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వారి కోసం ప్రత్యేక యాప్
- మహిళల భద్రత కోసం హైదరాబాద్ మెట్రో ప్రత్యేక చర్య
- ట్యూటెం యాప్‌తో ప్రయాణంలో మరింత రక్షణ
- అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే ట్యూటెం యాప్
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ, మెట్రో అధికారులు ప్రత్యేకంగా మహిళల కోసం “TUTEM” అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బిట్స్ పిలానీ-హైదరాబాద్, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ పోలీస్, ఐఐటీ ఖరగ్పూర్ , ముంబయికి చెందిన పలు సంస్థలు కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సహకారంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి.
ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు తమ ఇంటి నుండి గమ్యస్థానం వరకు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. “TUTEM” యాప్ మహిళా ప్రయాణికులకు మెరుగైన భద్రతా వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా మహిళలు ప్రయాణ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే తక్షణ సహాయం పొందవచ్చు. అలాగే, తమ ప్రయాణ వివరాలను విశ్వసనీయ వ్యక్తులతో పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. త్వరలోనే ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మహిళా ప్రయాణికుల భద్రతకు హైదరాబాద్ మెట్రో తీసుకుంటున్న ఈ చర్యలు ప్రశంసనీయం.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!