Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
- మెట్రో స్టేషన్ల అభివృద్ధికి అజిత్ రెడ్డి ఆదేశాలు
- బేగంపేట్ నుంచి రాయదుర్గ్ వరకు క్షేత్రస్థాయి తనిఖీ
- పార్కింగ్, పారిశుధ్యం, ప్రయాణికుల సౌకర్యాలపై ఫోకస్
- తొలి విడతలో 10 స్టేషన్లను మోడల్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్లను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు వెంటనే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి రాయదుర్గ్ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, పలు కీలక స్టేషన్లను, అక్కడి వీధి స్థాయి వసతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బేగంపేట్ నుండి రాయదుర్గ్ వరకు క్షేత్రస్థాయి పరిశీలన
పర్యటనలో భాగంగా బేగంపేట్, అమీర్ పేట్, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌లు, కాంకోర్స్ ప్రాంతాలను అజిత్ రెడ్డి సందర్శించారు. అక్కడ ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై మెట్రో ఇంజనీర్లు , ఆపరేషన్ల నిర్వాహక సంస్థ కియోలిస్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయదుర్గ్ వద్ద ఉన్న స్కైవాక్, ఐటీ కంపెనీలకు ఉన్న కనెక్టివిటీ మార్గాలు , మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద ప్రయాణికుల రాకపోకలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని, అలాగే స్టేషన్ల కింద ఉన్న వాణిజ్య సముదాయాల నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
పార్కింగ్, పారిశుధ్య నిర్వహణపై సమీక్ష
మెట్రో స్టేషన్ల కింద ఉన్న పార్కింగ్ స్థలాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, బేగంపేట్, అమీర్ పేట్, రాయదుర్గ్ పార్కింగ్ ఏరియాలను పరిశీలించి అభివృద్ధికి తగిన సూచనలు చేశారు. అలాగే, పిల్లర్ల మధ్య ఉన్న సెంట్రల్ మెరిడియన్ నిర్వహణ , పారిశుధ్య స్థితిగతులపై ఆయన సమీక్షించారు. ప్రయాణికులకు ఇచ్చే సేవలలో స్వచ్ఛత, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్వహణ చూసే ఏజెన్సీల పనితీరును ఇంకా మెరుగుపరచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రాథమికంగా 10 స్టేషన్ల ఎంపిక , తదుపరి చర్యలు
మెట్రో స్టేషన్లను మరింత మోడల్‌గా తీర్చిదిద్దేందుకు స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అజిత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా మొదటి విడతలో 10 మెట్రో స్టేషన్లను ఎంపిక చేసి, వాటిని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని మెట్రో స్టేషన్లను కూడా స్వయంగా సందర్శించి, ప్రయాణికులకు అందే సౌకర్యాలు, పార్కింగ్, పారిశుధ్యం , భద్రతను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని తెలిపారు. నగరవాసులకు అత్యంత సురక్షితమైన , ప్రశాంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!