Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro:: 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్-2024) హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ తెరవబడుతుంది. అయితే.. ఈ ఎగ్జిబిషన్‌కు నగరం నలుమూలల నుంచి సందర్శకులు పోటెత్తారు. ఇదిలా ఉండగా.. ఎప్పటిలాగే సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. దాదాపు 22 లక్షల మంది ఈ ప్రదర్శనను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
Read also: WhatsApp: 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్
Also Read
నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రవేశ టిక్కెట్ ధర రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్.. వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు.. వారాంతాల్లో, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు. అయితే.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వాహనాలతో లోపలికి వెళ్లి దర్శించుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అయితే.. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో దేశం నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చి స్టాళ్లను ఏర్పాటు చేసారు. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేనేత వస్త్రాల నుండి వంట సామాగ్రి వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇందులో ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి.
Electoral Bonds: ఇవాళ్టి నుంచి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం..
తాజావార్తలు
-
Sankranti Release: Sankranti Release: సంక్రాంతిపై కన్నేసిన దిల్ రాజు.. దాదాపు 150 రోజుల పాటు కొత్త సినిమా షూటింగ్!
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..