Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు కంపెనీ యాజమాన్యం శుభవార్త అందించింది. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూనే తక్కువ ధరకే ఏసీలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో అవకాశం కల్పించింది. ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా ప్రయాణించే వారికి ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడనుంది. సమయాల్లో మార్పులు చేస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు నడిచే సంగతి తెలిసిందే. అయితే తాజాగా చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఇక నుంచి మెట్రో చివరి రైలు రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది.
Read also: Keerthi Suresh : ఆ సీన్స్ చేసేందుకు ఓకే చెప్పిన మహానటి..?
లేట్ నైట్ ఆఫీసు డ్యూటీలు చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు తుది గమ్యస్థానానికి చేరుకుంటుంది. సాధారణంగా మొదటి మెట్రో ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే విషయం కూడా తెలిసిందే. అయితే ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు తొలి మెట్రో ప్రారంభం కానుంది. ఇది వారంలో ఒక రోజు మాత్రమే. ఇతర రోజుల్లో రైలు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. సోమవారం సగటున రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా మెట్రో సమయాన్ని మరో 45 నిమిషాలు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
Prajwal Revanna : 100 కోట్ల ఆఫర్… రేవణ్ణ కేసులో డీకే శివకుమార్‌పై బీజేపీ ఆరోపణ