Hyderabad Metro: అలర్ట్.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో మూసివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రెండు మెట్రో స్టేషన్లు రెండు గంటల పాటు మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు..అంటే 2 గంటలు.. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో ప్రారంభం కానుంది. ఆ తర్వాత సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్, యాకత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నల్లి, కార్వాన్, శేర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్ మీదుగా వెళ్లి గోషామహల్ వద్ద ముగుస్తుంది. దీంతో.. ఈ ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లు 15 నిమిషాల పాటు మూసివేయనున్నారు మెట్రో అధికారులు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను తదనుగుణంగా ప్లాన్ వేసుకోవాలని సూచించారు. ప్రధాని భారీ ఎన్నికల రోడ్ షో దృష్ట్యా కేంద్ర బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేశాయి.
Read also: Revanth Reddy: నవంబర్ 30 న అల్లుడు హరీష్ కు.. మామ కేసీఆర్ కు బుద్ది చెప్పాలి
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
ట్రాఫిక్ ఆంక్షలు
* ప్రధాని మోదీ ఎన్నికల రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్ వద్ద వీర్ సావర్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.
* ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను వీఎస్‌టీ, బాగ్ లింగంపల్లి, క్రౌన్ కేఫ్ మీదుగా, హిమాయత్ నగర్ నుంచి నారాయణగూడ క్రాస్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, సెమెటరీ, రామ్‌కోఠి మీదుగా డైవర్ట్ చేస్తున్నారు.
* ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను రామనగర సాగర్‌లాల్ ఆస్పత్రి మీదుగా, హిందీ మహావిద్యాలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను అజామాబాద్ క్రాస్ రోడ్డు మీదుగా, తెలుగు మాటల ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లించారు.
* ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా నారాయణగూడ క్రాస్ రోడ్డుకు వచ్చే వాహనాలను అశోక్ నగర్ మీదుగా మళ్లించారు. నారాయణగూడ శ్మశాన వాటిక నుంచి వచ్చే వాహనాలను రామ్‌కోఠి క్రాస్ రోడ్డు, భవన్ కళాశాల లేన్ మీదుగా మళ్లించారు.
🚨 Important Update, Hyderabad! 🚨
For security reasons, in light of PM Shri Narendra Modi's Roadshow today (27/11/2023), Chikkadpally and Narayanaguda stations will be closed 15 minutes before and after the event, tentatively from 16:30 to 18:30 hrs.
Arm-B of RTC X Roads… pic.twitter.com/3dps74NQvC— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 27, 2023
MP K. Keshava Rao: ఈసీ మాకు లీగల్ నోటీస్ ఇస్తే దానికి మేము ఆన్సర్ ఇచ్చే వాళ్లం..
తాజావార్తలు
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
-
Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!