HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. ఖానామెట్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్.!
- ఖానామెట్‌లో భారీ ఆపరేషన్
- 8 ఎకరాల భూమి స్వాధీనం
- ఆక్రమణలపై కఠిన చర్యలు
- రియల్ ఎస్టేట్‌కు వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అత్యంత చేరువలో ఉన్న ఖానామెట్ ప్రాంతంలో ప్రభుత్వ భూములపై హైడ్రా (HYDRAA) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఖానామెట్ సర్వే నంబర్ 55లో కొన్ని నిర్మాణ సంస్థలు అక్రమంగా ఆక్రమించుకున్న సుమారు 8 ఎకరాలకు పైగా భూమిని అధికారులు భారీ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ సుమారు 1200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని హైడ్రా ప్రాథమికంగా అంచనా వేసింది. గత కొంతకాలంగా ఈ విలువైన ప్రభుత్వ భూమిపై కొన్ని రియల్ ఎస్టేట్ , నిర్మాణ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ, అక్కడ తాత్కాలిక షెడ్లు , ఆర్‌సీసీ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. పక్కా సమాచారం, ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన హైడ్రా బృందం, పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఈ ఆక్రమణలను నేలమట్టం చేసింది.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
ఈ ఆపరేషన్ సందర్భంగా అక్కడున్న కార్మికుల షెడ్లను తొలగించడమే కాకుండా, సదరు నిర్మాణ సంస్థ చేతే ఆర్‌సీసీ ప్లాంట్‌ను స్వయంగా తొలగింపజేశారు. వాస్తవానికి ఈ భూమి అసైన్డ్ ల్యాండ్‌గా గుర్తించబడిందని, ఇది ఇప్పటికే ప్రభుత్వ నిషేధిత జాబితాలో (Prohibited List) ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణలను తొలగించిన వెంటనే ఆ 8 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, అది ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను నాటారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఆక్రమణలను తొలగించినప్పటికీ, మళ్లీ తప్పుడు క్లెయిమ్‌లతో నిర్మాణ సంస్థలు చొరబడటంతో ఈసారి హైడ్రా మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రియల్ ఎస్టేట్ సంస్థల తప్పుడు వాదనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!