NTV Telugu Site icon

Hyderabad: టీఎస్ఆర్టీసీ బస్సుపై పోకిరీల రాళ్లదాడి.. ప్రశ్నించిన డ్రైవర్, కండక్టర్‌పై కత్తితో..

Sankrathi Festivel

Sankrathi Festivel

Hyderabad: మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఫుల్‌ గా తాగి రోడ్డుపై నానా రభస చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఓ వ్యక్తి అర్ధరాత్రి రోడ్డుపై సర్ట్‌ విప్పి పోలీసుల కార్‌ ఎక్కి హల్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతను మద్యం మత్తులో ఉండటం వలన పోలీసులు అతన్ని సముదాయించి కిందికి దించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆకతాయిలు మద్యం ఫుల్‌ గా సేవించి ఆర్టీసీ బస్సులపై దాడి చేస్తున్నారు. బస్సులపై రాళ్లదాడి చేసి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే మహిళలకు ఫ్రీ జర్నీ మహత్యమో ఏమో కానీ.. మద్యం సేవించిన కొందరు బస్సుపై రాళ్లదాడి చేయడం సంచలంగా మారింది. ఈ హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ లోని సాగర్ రింగ్ రోడ్డులో చోటుచేసుకుంది.

Read also: Devara OTT : దేవర ఓటీటీ హక్కులు.. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ…

ఎల్బీనగర్ లో ఆర్టీసీ బస్(TS08UK098) పైకి ఓ యువకుడు మద్యం మత్తులో బస్సుపై రాళ్లదాడి చేశాడు. దీంతోబస్సు అద్దాలు పగలాయి. బస్సు డ్రైవర్, కండెక్టర్ కిందికి దిగి ఆ యువకున్ని ప్రశ్నించారు. ఎందుకు రాళ్లదాడి చేశారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు.. డ్రైవర్‌, కండెక్టర్‌ పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన కండెక్టర్‌ అతన్ని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈదాడిని చూసిన స్థానికులు భయందోళనకు గురయ్యారు. అక్కడే వున్న కొందరు ఆ యువకున్ని పట్టుకున్నారు. తీసుకుని వెళ్లి బైక్‌ పై కూర్చోపెట్టినా కూడా కత్తితో ఆ యువకుడు దాడి చేయడానికే ప్రయత్నించగా అతని ఫ్రెండ్‌ అతన్ని ఆపారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉండి ఇలా ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం సరైన పద్దతి కాదని ఆర్టీసీ సిబ్బంది మండి పడుతున్నారు. రాళ్లు మనషులకు తగిలిఉంటే, వారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కత్తితో దాడి చేయడానికి వచ్చిన యువకుడి వివరాలు సేకరించాలని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆర్టీసీ యాజమన్యం తెలిపింది. పండుగకు ప్రజల గురించి ఆలోచించి కుటుంబానికి దూరం ఉండికూడా ప్రజల కోసం కష్టపడుతున్న మా కండెక్టర్లు, డ్రైవర్‌ లపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌