గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు..త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై రెట్టింపు అంచనాలను పెంచేస్తున్నాయి.. గతంలో ఎక్కడ కనిపించని లుక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు..
ఇక దేవర మూవీకి ఉన్న హైప్ ఎలాంటిదో మనకు తెలుసు. ఈ సినిమా థియేట్రికల్, ఓటీటీ హక్కులకు ఎంత డిమాండ్ ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు.. ఎన్టీఆర్ సినిమా అంటే మాటల్లేవు.. మాట్లాడుకోవడాలు లేవు.. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది. తెలుగే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల హక్కులు కూడా ఈ ఓటీటీకే దక్కాయి..
నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అతడే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దేవర ఓటీటీ హక్కుల గురించి వెల్లడించాడు.. దేవర పాన్ ఇండియా మూవీ కావడం, ఓ రేంజ్ హైప్ ఉండటంతో 8 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి రానుంది. ఈ దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీలో తారక్ డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. తండ్రిగా, కొడుకుగా అతడు కనిపించనున్నాడు.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఈ మధ్యే గ్లింప్స్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ కు రెస్పాన్స్ మామూలుగా లేదు.. ఇప్పటికి ట్రెండ్ అవుతుంది.. అనిరుద్ బ్యాక్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని తెలుస్తుంది..