TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG SAFE: నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార తయారీ, విక్రయ సంస్థలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 11 ప్రత్యేక బృందాలు ‘క్యూర్’ పరిధిలోని 15 మాంస విక్రయ, ప్రాసెసింగ్ యూనిట్లు 4 కరాచీ బేకరీ తయారీ కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి.
అధికారులు తనిఖీలు చేపట్టిన వాటిలో ప్రముఖ రిటైల్ సంస్థ మెట్రో క్యాష్ అండ్ క్యారీ (గగన్‌పహాడ్, మూసాపేట్, సుచిత్ర ఎక్స్ రోడ్, ఉప్పల్ బ్రాంచ్‌లు), డిలైట్‌ఫుల్ గౌర్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ – లిషియస్ (కిస్టాపూర్, మేడ్చల్), కరాచీ బేకరీ యూనిట్లు (శ్రీనగర్ కాలనీ, గగన్‌పహాడ్, ఎంజే మార్కెట్-గోషామహల్, మాదాపూర్), వతన్ ఫ్రెష్ మార్ట్, వతన్ ట్రేడర్స్ (ముషీరాబాద్), పంజాబ్ ఫిష్ కంపెనీ, ప్రోటీన్ ఫుడ్స్, హై ప్రోటీన్ (సికింద్రాబాద్), ఎస్ఎం సీ కార్పొరేషన్ (ఉప్పల్), ఏపీ ఫిషరీస్ (మల్కాజిగిరి) తదితర 19 సంస్థలు ఉన్నాయి.
Also Read
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
- CM Revanth Reddy : సిద్దిపేటలో కేసీఆర్‌కు రేవంత్ సవాల్.. మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు
- Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
తనిఖీల్లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు
లైసెన్సులు లేకుండానే వ్యాపారం: పలు సంస్థలు కనీసం FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
తీవ్ర అపరిశుభ్రత: నేలంతా రక్తం, మాంసం వ్యర్థాలతో నిండిపోయి ఉంది. డ్రైనేజీలు ఆహార వ్యర్థాలతో మూసుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. గోడలకు రక్తపు మరకలు, బూజు పట్టాయి.
కీటకాలు, ఎలుకల స్వైరవిహారం: ఆహార పదార్థాల తయారీ, నిల్వ కేంద్రాల్లో ఈగలు, బొద్దింకలతో పాటు బతికున్న ఎలుకలు తిరగడం, ఎలుకల రెట్టలు ఉండటాన్ని అధికారులు గుర్తించారు.
తప్పుడు లేబులింగ్: గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడంతో పాటు, తయారీ తేదీలను మార్చి తప్పుడు లేబులింగ్‌తో విక్రయిస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల ఆరోగ్య రికార్డులు, నీటి నాణ్యత నివేదికలు కూడా అందుబాటులో లేవు.
అధికారుల కఠిన చర్యలు:
ఈ దాడుల్లో సుమారు రూ. 6,59,213 విలువైన 1,672 కిలోల కల్తీ, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేసి ధ్వంసం చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న ఆనంద్ మటన్ అండ్ చికెన్ పాయింట్ (నల్లకుంట), సల్మాన్ కేజీఎన్ పౌల్ట్రీ (ఎర్రగడ్డ), న్యూ డీసెంట్ మీట్ చికెన్ అండ్ ఫిష్ షాప్ (ఎర్రగడ్డ), మెసర్స్ ప్రోటీన్ ఫుడ్స్ (ఎస్పీ రోడ్, సికింద్రాబాద్), మెసర్స్ ఏపీ ఫిషరీస్ ఫిష్ స్టాల్ (మల్కాజిగిరి) లను అధికారులు తక్షణమే మూసివేశారు.
అలాగే ఆరు సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేసి తక్షణమే వ్యాపారం నిలిపివేతకు ఆదేశం ఇచ్చారు. కరాచీ బేకరీ పెర్ల్ ప్రైవేట్ లిమిటెడ్ (గగన్‌పహాడ్) రవాణా అనుమతి లేకుండానే మూడు వాహనాలను వాడటం, తయారీ, ప్యాకేజింగ్ ప్రాంతాల్లో తీవ్ర అపరిశుభ్రత, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు, ఎలుకల రెట్టలు, ఈగలు ఉండటాన్ని గుర్తించారు. ముఖ్యంగా అక్టోబర్ నెలలో తయారైన ఆహార పదార్థాలపై నవంబర్ నెలలో తయారైనట్లు తప్పుడు లేబుల్స్ వేసి విక్రయిస్తుండటంతో రూ. 4,34,813 విలువైన 1,012 కిలోల ప్యాక్డ్ ఫుడ్‌ను సీజ్ చేశారు.
కరాచీ ఐఎన్‌సీ (శ్రీనగర్ కాలనీ)లో కేక్ సెక్షన్‌లోని ఫ్రిజ్‌లు అపరిశుభ్రంగా ఉండటం, కిచెన్‌లో ఆహార పదార్థాలతో పాటే క్లీనింగ్ కెమికల్స్ నిల్వ చేయడం, శాఖాహార, మాంసాహార పదార్థాలను ఒకే ఫ్రిజ్‌లో పెట్టడం, వండిన పచ్చి ఆహారాన్ని కలిపి ఉంచడం, బొద్దింకలు, ఈగల బెడద ఉండటంతో లైసెన్స్ సస్పెండ్ చేశారు. వతన్ ట్రేడర్స్ (జమిస్తాన్పూర్, ముషీరాబాద్)లో జంతు వధ తర్వాత మిగిలిన ఈకలు, తలలు, కాళ్లు వంటి వ్యర్థాలను అపరిశుభ్రంగా పడేయడం, పైకప్పు సరిగా లేక బూజు పట్టడం, నేలంతా రక్తపు మరకలు, ఈగల బెడద ఉండటంతో చర్యలు తీసుకున్నారు.
పంజాబ్ ఫిష్ కంపెనీ (సికింద్రాబాద్)లో చేపల నిల్వ కేంద్రంలో మురుగునీరు నిలిచిపోవడం, పైకప్పు పెచ్చులు ఊడి కింద ఉన్న ఫ్రిజ్‌లలో పడే ప్రమాదం ఉండటం, గడువు ముగిసిన ఫ్రోజన్ రొయ్యలు నిల్వ చేయడం, తుప్పు పట్టిన కత్తులు వాడటం వల్ల లైసెన్స్ రద్దు చేశారు. మెసర్స్ హై ప్రోటీన్ (ఎస్డీ రోడ్, సికింద్రాబాద్)లో గడువు ముగిసిన, లేబుల్ లేని ఆహార పదార్థాలు ఉండటం, చికెన్ కటింగ్ ఏరియాలో బతికున్న ఎలుకలు తిరగడం, ఫ్రీజర్‌లో చనిపోయిన ఈగలు కనిపించడంతో తక్షణమే మూసివేయాలని ఆదేశించారు.
ఎస్ఎం సీ కార్పొరేషన్ (ఉప్పల్)లో సరైన లైసెన్స్ కేటగిరీ లేకపోవడం, ఐస్ తయారీ యంత్రం వద్ద గోడ పెచ్చులు ఊడిపడటం, శుభ్రపరచని పరికరాలను వాడటం, ఈగల బెడద కారణంగా లైసెన్స్ సస్పెండ్ చేశారు. లోపాలను సరిదిద్దుకోవాలని వతన్ ఫ్రెష్ మార్ట్ (ముషీరాబాద్), మెట్రో క్యాష్ అండ్ క్యారీ (ఉప్పల్) సంస్థలకు ‘ఇంప్రూవ్మెంట్ నోటీసులు’ జారీ చేశారు. అలాగే తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ (గగన్‌పహాడ్, మూసాపేట్, సుచిత్ర), సాయిబాబా ఐఎన్‌సీ – కరాచీ బేకరీ (ఎంజే మార్కెట్), లిషియస్ (మేడ్చల్) సహా మూసివేసిన 5 సంస్థలకు (మొత్తం 10 సంస్థలకు) భారీ జరిమానాలు విధించేందుకు ‘షోకాజ్ నోటీసులు’ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
-
Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
-
Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!