Site icon NTV Telugu

Kidney Racket: కిడ్నీ రాకెట్‌ కొత్త కోణం.. హైదరాబాద్, కేరళ వేదికగా దందా..

Kidney Roceks

Kidney Roceks

Kidney Racket: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మధ్యతరగతి యువకుల కిడ్నీలను కంత్రీగాళ్లు కొట్టేస్తున్నారు. కిడ్నీలు చెడిపోయాయంటూ అమాయక ప్రజలను నమ్మించి అవి సంపన్నుల దగ్గర లక్షలు బేరం పెట్టి పేదల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాలు అన్నీఇన్నీ కావు. తాజాగా కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ నడుస్తోందని పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీస్ అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు సంచలన విషమాలు వెలుగులోకి వచ్చాయి.

Read also: Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!

ఇప్పటివరకు పదుల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో సబిత్ అనే యువకుడు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. సబిత్ ఇచ్చిన సమాచారంతో కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ డాక్టర్ కి ఇద్దరు యువకులు సహకరించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఠా సభ్యులు బెంగళూరు, హైదరాబాద్‌లోని పేద యువకులను ఇరాన్‌కు తీసుకెళ్లి అక్కడ వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. బాధితుల్లో ఒకరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరాన్ నుంచి కొచ్చికి వచ్చిన ముఠాలోని కీలక సభ్యుడు సబిత్‌ను కేరళ పోలీసులు గత ఆదివారం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సోమవారం అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

Read also: Ambala Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 20 మందికి పైగా గాయాలు

రిమాండ్ రిపోర్టులోని వివరాల ప్రకారం.. సబిత్ ఈ వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం అతను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కావడమే. 2019లో హైదరాబాద్‌కు చెందిన సబిత్ అనే వైద్యుడు ఢిల్లీకి చెందిన వ్యక్తికి కిడ్నీ దానం చేయడం ద్వారా స్నేహం ప్రారంభించాడు. బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన 40 మంది యువకులను ఇరాన్‌కు తీసుకెళ్లి వారి కిడ్నీలను విక్రయించినట్లు సబిత్ అంగీకరించాడు. డబ్బు అవసరం ఉన్న పేద యువతకు దళారులు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి కిడ్నీలు అమ్ముకునేలా మభ్యపెడుతున్నారు. కొందరు బ్రోకర్లు వారికి పాస్ పోర్టులు, వీసాలు సిద్ధం చేసి ఇరాన్ కు తీసుకెళ్తున్నారు. ఇరాన్‌లో రక్తసంబంధీకులు కాని వారికి అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే వారిని అక్కడికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఏ కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ణయించిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేస్తారు. ఆ తరువాత 20 రోజులు అపార్ట్మెంట్లో ఉంచబడుతుంది. రూ.లక్ష వరకు ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఒక్కో కిడ్నీ దానానికి రూ.20 లక్షలు అమ్ముతున్నట్లు సమాచారం.
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఇంతలా కష్టపడిందా.. ప్రాక్టీస్ వీడియో వైరల్!

Exit mobile version