Site icon NTV Telugu

Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో చలనం.. కేబుళ్ల తొలగింపుపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

Cable Wire

Cable Wire

Bhatti Vikramarka : హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్‌ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్‌నగర్‌లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.

మంగళవారం చాంద్రాయణగుట్ట బండ్లగూడలో మరో విషాదం చోటు చేసుకుంది. 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తరలించే సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు—ధోని (21), వికాస్‌ (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అంబర్‌పేటలో కూడా ప్రమాదం జరిగింది. వినాయక మండపానికి పందిరి కడుతున్న సమయంలో కరెంట్ వైర్లు తగలడంతో రామ్ చరణ్ అనే వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అతడి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!

ఈ వరుస ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రామంతాపూర్‌, బండ్లగూడ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల తర్వాత వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వర్షాల సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను తొలగించే పనులు ప్రారంభించారు. ఉప్పల్‌, రామంతాపూర్‌, చిలకానగర్‌లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. అనుమతి లేకుండా కనెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడటం సహించబోమని భట్టి స్పష్టం చేశారు.

JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..

Exit mobile version