NTV Telugu Site icon

CP Kothakota Srinivas Reddy : ఇన్‌స్పెక్టర్లకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్‌

Cp Kothakota Srinivas Reddy

Cp Kothakota Srinivas Reddy

CP Kothakota Srinivas Reddy: ఇన్‌స్పెక్టర్లకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పోస్టింగ్ విషయంలో కొందరు ఇన్‌స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పోస్టింగ్‌ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read: Coronavirus: క‌రోనా అల‌జ‌డి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు

సిఫార్సు లేఖలు పట్టుకొచ్చే వారి పేర్లు ఏసీఆర్‌లో నమోదు చేస్తామని, ఒకసారి ఏసీఆర్‌లో పేరు నమోదైతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేశారు. పోస్టింగుల విషయంలో రాజకీయాలు లేకుండా చూస్తామన్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తొలగ్గే ప్రసక్తే లేదన్నారు. టాలెంట్ ఉన్న సమర్థవంతమైన అధికారులను మాత్రమే విధుల్లో ఉంచుతామన్నారు. సిఫార్సు లేఖలు తెచ్చి సిబ్బంది పోస్టింగులు అడిగితే ఇచ్చే ప్రసక్తేలేదని ఆయన చెప్పారు.

Also Read: Tamil Nadu Floods: తమిళనాడులో హృదయవిదారక ఘటనలు.. ఇళ్ల ముందే శవాలను కాల్చుతున్న వైనం.

Show comments