సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోం గార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా పోలీస్ అధికారిణి లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమయినది. అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది… యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు.
ఇటీవల సినిమాలలో కూడా మహిళల పాత్ర చాలా గొప్పగా చూపిస్తున్నారు. సినిమాల ప్రభావం వల్ల పోలీస్ అవ్వాలని అందరూ అనుకుంటారు… నేను కూడా అలా అనుకున్నవాడినే. సమాజంలో పోలీస్ విధులు, బాధ్యతలు.. పోలీసులకు నిజమైన సినిమాలు చూపిస్తాయి. మహిళలకు సరైన స్థానం, గౌరవం ఇవ్వాలి. నేను వ్యక్తి గతంగా కూడా చాలా గౌరవిస్తాను.. నా భార్యను ఉద్యోగ పరంగా చాలా ప్రోత్సహించాను. ఏకానమీ థియరీ ప్రకారం సమాజంలో మహిళలు 50శాతం ఉంటారు… వాళ్ళు అన్ని రంగాలలో లేపోతే ఏకానామీ, జీడీపీ పడిపోతుందన్నారు సీవీ ఆనంద్.
మహిళలకు స్వేచ్చ ఇవ్వాలి… వాళ్ళ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలి. ఇండియాలో కోటి 40 లక్షల మంది, రాష్ట్రములో 64 వేల సిబ్బంది, నగరంలో 4,817 మంది అంటే 8% మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. మహిళలు ఇంకా ఎదగాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనరేట్ కు 174 ఏండ్ల చరిత్ర ఉంది. 59 వ పోలీస్ కమీషనర్ ను నేను. ఒక SHO గా మహిళా ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది, తప్పు చేశాను అనే ఆలోచన కూడా వచ్చింది. మీడియా మిత్రులు కూడా సలహా ఇచ్చారు. పైగా ఈ రోజు ఉమెన్స్ డే, చాలా మంచి రోజు. అందుకే ఈ రోజు ఒక విమెన్ ను SHO గా అపాయింట్ చేసాం. ఈ వ్యవస్థ కొనసాగుతుంది.. ఇక ఆగదు. SHO మధులతకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు మహిళా సిబ్బందికి ఆదర్శం.అందరూ మీ స్థాయికి చేరాలి. చాలా చోట్ల మహిళలకు సౌకర్యాలు లేవు. సీఎం కేసీఆర్ పెట్టిన ఫస్ట్ మీటింగ్ విమెన్ సేఫ్టీ.. లా అండ్ ఆర్డర్స్.
మేము అడిగింది 150 కోట్లు అయితే, సీఎం ఇచ్చింది 300 కోట్లు. అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బంది కోసం సౌకర్యాలు, వసతులు కల్పించాం. బట్టలు మార్చుకోడానికి, చైల్డ్ ఫీడింగ్ రూమ్, వాష్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ కల్పిస్తున్నాం. మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అన్నారు సీవీ ఆనంద్. పని ప్రదేశాల్లో మహిళా వేధింపులు చాలా తగ్గాయి. కొన్ని కేసుల్లో పురుషుల కన్న మహిళలే కేసులు తేలికగా చేధించగలరన్నారు. ప్రతీ ఎయిర్ పోర్ట్ లో మహిళా సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నేను ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఇన్ ఛార్జి ఆఫీసర్ గా పని చేశానన్నారు. మహిళలు , మహిళా అధికారిణి స్థాయి వరకు ఎదగాలి. మీ భవిష్యత్తు కు మీరు అడ్డుకట్ట వేసుకోవద్దు… మీరంతా ఉన్నత స్థాయికి చేరాలి.1200 మంది మహిళా సిబ్బందికి సాయంత్రం జీవీకే మాల్ లో భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ గా చూపిస్తున్నాం అని వివరించారు సీపీ సీవీ ఆనంద్.
