మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. ఇవాళ SHO గా నియామకం అయిన మధులతకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియాలో ప్రతీ రోజు ఉమెన్స్ డే నే…మన దేశంలో మహిళలను గౌరవించుకుంటాం. విదేశాల్లో అలా ఉండదు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది పాత్ర కీలకం… వారి సంఖ్య కూడా పెరిగింది.. అన్నీ పీ. యస్ లలో మహిళా సిబ్బంది కి అన్నీ వసతులు…
సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోం గార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా పోలీస్ అధికారిణి లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమయినది. అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది… యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల సినిమాలలో కూడా మహిళల…