Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Restrictions: దీపావళి పండుగ వేడుకల సందర్భంగా చార్మినార్‌లోని ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. 2026 నవంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా చార్మినార్ వైపు వెళ్లే మూడు ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
* మదీనా నుంచి చార్మినార్
* ముర్గి చౌక్ నుంచి చార్మినార్
* షా అలీ బండ రాజేష్ మెడికల్ హాల్ నుంచి చార్మినార్
Also Read
- Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
- Minister Uttam Kumar Reddy: బడ్జెట్‌కు మించి నిధులిస్తాం..! భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం భరోసా
- CM Revanth Reddy: "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి".. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమం..
- Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
ఈ నేపథ్యంలో సాధారణ వాహనదారులు పై మార్గాల్లో ప్రయాణించకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు ట్రాఫిక్ సూచికలను, విధుల్లో ఉండే సిబ్బంది ఆదేశాలను పాటిస్తూ నిర్దేశిత ప్రాంతాల్లోనే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
భక్తుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలు:
మీర్‌చౌక్ ముఫీద్-ఉల్-అనామ్ స్కూల్ గ్రౌండ్ (బాలురు), సర్దార్ మహల్ రోడ్డు (స్కూల్ ఆటస్థలం వెనుక భాగం)
షా అలీ బండ చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, యునానీ ఆసుపత్రి ప్రాంగణం
మదీనా, నయాపూల్ ఎస్‌వైజే (SYJ) కాంప్లెక్స్, కాళీ కమాన్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (ఆదివారం మాత్రమే)
పురానాపూల్, బేగంబజార్ ఎంజే బ్రిడ్జ్, ప్రభుత్వ సిటీ కాలేజీ, కులీ కుతుబ్ షా (QQ) స్టేడియం
హుస్సేనీ ఆలం న్యూ ముర్గి చౌక్ ఖిల్వత్ రోడ్డు, జులూ ఖానా లాడ్ బజార్ (ఖిల్వత్ రోడ్డు), ఖిల్వత్ గ్రౌండ్
తాజా ట్రాఫిక్ అప్డేట్ల కోసం సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ ([facebook.com/HYDTP](https://facebook.com/HYDTP)), ఎక్స్ ([twitter.com/HYDTP](https://twitter.com/HYDTP)) ఖాతాలను పరిశీలించాలని అధికారులు కోరారు. అత్యవసర ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని, నగర ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.
తాజావార్తలు
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!