KTR : జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం దుర్మార్గమని ఆయన ఎక్స్ (X)లో పోస్ట్ చేస్తూ విమర్శించారు. సిటీ బస్సు ఛార్జీలను ఏకంగా రూ.10 పెంచడం పేద, మధ్యతరగతి ప్రయాణికులపై పెద్ద భారమని అన్నారు. ఈ పెంపుతో ఒక్కో ప్రయాణికుడికి నెలకు కనీసం రూ.500 వరకు అదనపు భారం పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల జేబులు కొల్లగొట్టే ఈ నిర్ణయంపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
YS Jagan: మీ సొంత ఆదాయాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా..? నకిలీ మద్యంపై జగన్ ఫైర్..
అలాగే, విద్యార్థుల బస్సు పాసులు, టీ-24 టికెట్ల ధరలను కూడా పెంచినట్లు గుర్తు చేశారు. కనీస ఛార్జీలపై 50 శాతం ధర పెంపు అంటే ఇది ప్రజలపై అన్యాయం చేయడమేనని కేటీఆర్ అన్నారు. ఉచిత బస్సు పథకంతోనే ఆర్టీసీ దివాలా తీసిందని, సంస్థను గట్టెక్కించాల్సిందిపోయి ఇప్పుడు సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు.
Visakhapatnam: విశాఖలో అలలు ధాటికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
