Site icon NTV Telugu

కెనడాలో హైదరాబాద్ యువతి అవస్థలు…

కెనడాలోని మాన్‌ట్రీల్ ల్లో హైదరాబాదు యువతి అవస్థలు పడుతుంది. రెండు నెలల గర్భవతైన దీప్తి రెడ్డి అనే యువతిని కెనడాలో వదిలేసి హైదరాబాద్ కు వచ్చాడు భర్త చంద్రశేఖర్ రెడ్డి. మెక్ గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్ డాక్ గా పని చేస్తున్నాడు చంద్రశేఖర్. ఆగస్టు 9న చంద్రశేఖర్ ఇండియాకు రాగా… 2021 ఆగస్టు 20న ఇండియన్ హై కమిషన్ కు దీని పై ఫిర్యాదు చేసింది దీప్తి. భర్త ఆచూకీ కోసం ట్విట్టర్ కేంద్రంగా విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ లేఖలో పేర్కొంది దీప్తి.

ఈ విషయం అపి రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది విదేశాంగ శాఖ. దాంతో చంద్రశేఖర్ ఆచూకి కనిపెట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు రాచకొండ సీపీ. అయితే చైతన్యపురి పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు చంద్రశేఖర్ అన్న శ్రీనివాస్. అయితే నేడు శ్రీనివాస్ ఇంటి ముందుకు వచ్చి ఈ విషయం పై ఆందోళన చేస్తున్నారు దీప్తి తల్లిదండ్రులు. అలాగే భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ లో దీప్తి రెడ్డి పేరెంట్స్ ఫిర్యాదు చేసారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు.

Exit mobile version