NTV Telugu Site icon

RangaReddy:భార్య, అత్త, మామపై దాడి..ఆపై ఆత్మహత్యాయత్నం

Crime

Crime

మ‌ధ్యం మ‌త్తులో భార్య, అత్త‌, మామ‌పై దాడి చేసి ఆపై ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న రాజేంద్రనగర్ ప‌రిధిలో చోటుచేసుకుంది. భార్య భ‌ర్త ల వ్య‌వ‌హారం చేయి చేసుకునేంత వ‌ర‌కు వెళ్ళింది. అత్త‌మామ‌లు ప్ర‌శ్నించడంతో ఆగ్ర‌హంతో వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘ‌ట‌నపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప‌రిధిలో మంజుల‌, కుమార్ నివాసం వుంటున్నారు. మ‌ద్యం సేవించిన కుమార్‌ భార్య‌తో గొడ‌వ‌కు దిగాడు. భార్య మంజుల పై అతికిరాత‌కంగా దాడి చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా భార్య మంజులా దేవిని భర్త కుమార్ చితకబాదడంతో భార్య మంజులకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో మంజులా తమ కుటుంబ సభ్యులకు భర్త దాడి గురించి తెలిపింది. అక్కడకు చేరుకున్న మంజుల తల్లిదండ్రులు తమ కూతురి ఎందుకు కొట్టవ్ అంటూ అల్లుడు కుమార్ ను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుమార్ నా ఇంటికే వచ్చి నన్నే ప్రశ్నిస్తారా అంటూ అత్త, మామ పై విచక్ఛనా రహితంగా దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు కావడంతో భయంతో కుమార్ రెండవ అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కుమార్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని తీవ్ర గాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. కుమార్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి రాంనగర్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. పీకల్లోతు మద్యం మత్తులో భార్యపై భర్త రమేష్ దాడి చేశాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న భార్య రాజ్యలక్ష్మిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే పోలీసులు వచ్చేసరికే రమేష్ పరారయ్యాడు. కాగా.. రమేష్‌కు రాజ్యలక్ష్మి రమేష్‌కు రెండో భార్య. అయితే నిత్యం మద్యం సేవించి రాజ్యలక్ష్మిని రమేష్ వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

RRR Movie: ఓటీటీలో చూడాలంటే రూ.200 చెల్లించాలా?