NTV Telugu Site icon

Husband Killed His Wife: భార్య పై అనుమానం.. తల నరికేసిన భర్త..!

Abdullapurmet Crime

Abdullapurmet Crime

Husband Killed His Wife: జీవితాంతం ఆదుకుంటానని ఆ వ్యక్తి అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశాడు. తన కష్టాలు, సంతోషాల్లో పాలు పంచుకుంటానని భార్య నమ్మింది. వివాహం తరువాత, వారి వివాహం చాలా అన్యోన్యంగాసాగింది. ఈ జంట తమ ప్రేమకు చిహ్నంగా ఒక బిడ్డను కూడా కలిగి ఉంది. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ… భర్త ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్యపై అతి కిరాతకానికి పాల్పడ్డాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్‌లో చోటుచేసుకుంది.

Read also: Merugu Nagarjuna: ఎల్లుండి అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ.. ఆయన ఆలోచనలు భారతావనికి దిక్సూచి

హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ కాలనీలో వినయ్-పుష్పలత అనే దంపతులు నివాసం ఉంటున్నారు. చాలా ఆనందంగా గడిపిన వీరి జీవితంలో ప్రేమకు ప్రతిరూపంగా ఒక బిడ్డకూడ కలిగింది. ఆతరువాత ఏం జరిగిందో ఏమోగానీ.. వీరి జీవితంలో కలతలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. ఆమెపై అనుమానం కారణంగా రోజూ గొడవలు జరిగేవి. అయితే ఒకరోజుతో ఆగలేదు.. గత కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతూనే వున్నాయి. ఆమెపై అనుమానం ఇంకాస్త పెరగడంతో వినయ్ సహించలేకపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్ వేశాడు. రోజూలేగే నిన్న ఇంటికి వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగాడు. మాట మాట పెరింగింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన వినయ్ భార్య పుష్పలతను తల నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు.

Read also: Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!

గట్టిగా కేకలు వినిపించడంతో.. స్థానికులు వచ్చి చూడగా మృతదేహం పక్కనే తల నరికి పెట్టి అక్కడే కూర్చన్న వినయ్ ను చూసి స్థానికులు షాక్ తిన్నారు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి నిందితుడు వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడు ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భార్య నిజంగానే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందా? మరి ఆ వ్యక్తి ఎవరు? లేక భర్త అనుమానం నిజమైనది కాదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Shamshabad: పొగమంచు ఎఫెక్ట్‌.. విమానాలు ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన..